AP: తిరుమల కొండపై పలు ప్రాంతాల్లో కడుతున్న అక్రమ కట్టడాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమలను కాంక్రీట్ జంగిల్‌గా మార్చొద్దని టీటీడీని హెచ్చరించింది. తిరుమల తిరుపతిని.. కాంక్రీట్ జంగిల్‌గా మారనీయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని TTDకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే తిరుమలలో చేస్తున్న పలు భవన నిర్మాణాల్లో అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు సూచించింది.