వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ పూర్తి

63பார்த்தது
AP: ఈ నెల 10, 11, 12 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ పూర్తి అయింది. రోజుకు 40 వేల చొప్పున 1.20 లక్షల టోకెన్లను బుధవారం రాత్రి నుంచి భక్తులకు అందుబాటులో ఉంచారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆ కోటా పూర్తి కావడంతో కేంద్రాలను మూసేశారు. మిగతా రోజు టోకెన్లను ఏరోజుకారోజు పంపిణీ చేస్తామని TTD ఇప్పటికే తెలిపింది. ఈ టికెట్ల కోసమే బుధవారం తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி