ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్‌కు భువనగిరితో విడదీయరాని అనుబంధం ఉంది. శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించిన ‘మండి’ సినిమా షూటింగ్ అధిక భాగం భువనగిరిలోనే జరిగింది. రెడ్డివాడలోని పురాతన భవనాల్లో సుమారు నెల రోజుల పాటు చిత్రీకరించారు. ఈ చిత్రంలో షబానా అజ్మీ, స్మితిపాటిల్, నజీరుద్దీన్‌షా, అమ్రిశ్‌పురి వంటి అగ్ర తారలు నటించారు. 1983లో విడుదలైన ఈ సినిమా మంచి గుర్తింపు పొందింది. జాతీయస్థాయి, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి.