పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేషన్‌కు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక ప్రకటన చేసింది. ఇందుకు నిర్దేశించిన గడువును మరో 15 రోజులు పొడిగించింది. గడువు నవంబరు 30తో ముగియగా.. తాజాగా డిసెంబర్ 15 వరకు ఈపీఎఫ్‌ఓ పొడిగించింది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.