బంగాళాఖాతంలో తుఫాన్.. "దానా"గా పేరు పెట్టనున్న ఐఎండీ

73பார்த்தது
బంగాళాఖాతంలో తుఫాన్.. "దానా"గా పేరు పెట్టనున్న ఐఎండీ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర అండమాన్ పై కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది మంగళవారానికి వాయుగుండంగా మారి, బుధవారానికి తుఫాన్‌గా మారే అవకాశముందని వెల్లడించింది. దీనికి 'దానా'గా పేరు పెట్టనునట్లు ఐఎండీ పేర్కొంది. ఇది ఈ నెల 24న ఒడిశా- పశ్చిమ బెంగాల్‌ల మధ్యం తీరం దాటుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పింది.

தொடர்புடைய செய்தி