హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో వేదికపైనే ఆ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు శనివారం లైంగిక వేధింపులకు గురైంది. పార్టీ సీనియర్ నేత దీపేందర్ హుడా సమక్షంలోనే హర్యానా మహిళా కాంగ్రెస్ నాయకురాలు పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకురాలు సెల్జా కుమారి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ఎంపీ సెల్జా కుమారి డిమాండ్ చేశారు .