దుర్మార్గంలో BRSని కాంగ్రెస్ మించి పోయింది: బండి

65பார்த்தது
TG: గత BRS ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 400ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తుందని, ఇదంతా తెలిసి కూడా సర్కార్ భూముల చదును పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని మండిపడ్డారు. చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి దిగుతుందని అన్నారు. కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా మారిందని బండి వ్యాఖ్యానించారు.

தொடர்புடைய செய்தி