సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలిపారు. ఆ ఘటన తమను బాధించిందన్నారు. తాము సినీ పరిశ్రమకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బౌన్సర్ల విషయంలో సీరియస్‌గా ఉంటామని పేర్కొన్నారు. అభిమానులను కంట్రోల్ చేసుకోవల్సిన బాధ్యత సెలబ్రెటీలదేనని స్పష్టం చేసినట్లు సమాచారం. అసెంబ్లీలో చెప్పిన వాటికి కట్టుబడి ఉంటామన్నారు.