ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌ రూపకల్పనపై అధికారుల‌కు సీఎం రేవంత్ ఆదేశాలు

66பார்த்தது
ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌ రూపకల్పనపై అధికారుల‌కు సీఎం రేవంత్ ఆదేశాలు
ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల అమలుకు రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలోనూ రెండు ప్రాంతాలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని ఎంపిక చేయాలని, పూర్తిగా గ్రామీణ ప్రాంతాలున్న నియోజకవర్గాల్లోనైతే రెండు గ్రామాలను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకోవాలని సూచించారు. పూర్తిగా నగర, పట్టణ ప్రాంతాలున్న నియోజకవర్గాల్లో రెండు వార్డులు, డివిజన్లను ఎంపిక చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி