బెంగళూరులో 12 కేక్ శాంపిళ్లలో క్యాన్సర్ కారకాలను గుర్తించినట్టు కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత విభాగం ప్రకటించింది. మొత్తం 235 శాంపిళ్లను సేకరించగా.. అందులో ప్రజాదరణ పొందిన రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ లాంటి కేక్‌లలో తరచూ ఈ కృత్రిమ రంగులను కలుపుతున్నారని, వీటివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రజలను హెచ్చరించింది. దీంతో రంగుల వాడకంలో ప్రమాణాలు పాటించాలని బేకరీలను ప్రభుత్వం ఆదేశించింది.