తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల్లో గెలిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధిష్ఠానం దృష్టిసారించిందని, ఈ క్రమంలోనే కేబినేట్ విస్తరణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాతే కేబినేట్ విస్తరణ ఉండే అవకాశముందని సమాచారం.