తెలంగాణ శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై నిరసన వ్యక్తం చేశారు. అప్పులు ఘనం – అభివృద్ధి శూన్యం అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. అప్పులు ఆకాశంలో – అభివృద్ధి పాతాళంలో అంటూ నినాదాలు చేశారు. ఇంత అప్పు చేసి, ఎంత మందికి తులం బంగారం అందించారు? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీశారు.