TG: కాంగ్రెస్ సర్కారుపై రైతులు కన్నెర్రజేశారు. రైతుభరోసా పేరిట పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఆ సాయాన్ని రూ.12 వేలు మాత్రమే ఇస్తామంటూ మాటతప్పడంపై రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రైతు భరోసా రూ.15 వేలు ఇవ్వకుండా, ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందంటూ బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు.