ఢిల్లీలో మరో దారుణం జరిగింది. సోషల్ మీడియాలో పరిచయమైన బ్రిటిష్ పర్యటకురాలిపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీలోని ఓ హోటల్‌లో పరిచయం అయిన వ్యక్తితో పాటు, మరో వ్యక్తి కలిసి ఆమెపై అత్యాచారం జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అధికారులు బ్రిటిష్ హై కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.