హైదరాబాద్ నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు యాజమాన్యం వెల్లడించింది. అప్రమత్తమైన అధికారులు బాంబు స్క్వాడ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పాఠశాలకు చేరుకున్న బాంబు స్క్వాడ్.. పాఠశాలలో అణువణువునా తనిఖీ చేస్తున్నారు. ఈ నెలలోనే రెండవసారి పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.