HCU భూములపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ క్రమంలో BJP నేతలు HCUకి బయలుదేరేందుకు యత్నించారు. ఈ క్రమంలో ముందస్తుగా పోలీసులు BJLP నేత మహేశ్వర్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో తన నివాసంలో హౌజ్ అరెస్ట్ చేశారు. MLA క్వార్టర్స్‌ను పోలీసులు చుట్టుముట్టి అక్కడి వచ్చిన ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పాయల్ శంకర్, నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి సమీప PSకు తరలించారు.