ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఈ ఘటన జరిగింది. బీహార్‌కు చెందిన నితేష్ కుమార్ ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి ఆపై చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆపై సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లగా పారిపోబోయాడు. పోలీసులు కాల్పులు జరపగా గాయపడి చనిపోయాడు.