తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లక్ష్మణ్ చందా మండలానికి చెందిన 8 ఏళ్ల బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుండగా.. బొమ్మెన సాగర్ (36) అని వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ చిన్నారి ఏడుస్తూ వెళ్లి తల్లికి చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.