ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 905 ఉద్యోగాలకు ఈ ఏడాది ఫిబ్రవరి 23న నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలో స్పోర్ట్స్ సహా సాధారణ కోటాతో కలిపి మొత్తం 2,517 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్టు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఫలితాలతో పాటు మెయిన్ పరీక్ష ఫైనల్ ‘కీ’ని కూడా అధికారులు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వెబ్‌సైట్: https://portal-psc.ap.gov.in/HomePages/NotificationWiseResults_New?Flag=LS9+reX77Et1YWyvKhovmw==