వైద్య సిబ్బందికి క్షమాపణలు చెప్పిన ఏపీ MLA నానాజీ (వీడియో)

563பார்த்தது
ఏపీలోని కాకినాడ రూరల్ జనసేన పార్టీ MLA నానాజీ వైద్య సిబ్బందికి క్షమాపణలు తెలిపారు. రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు పై ఆయన దురుసుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైద్య సంఘం సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. దీంతో దిగొచ్చిన MLA నానాజీ.. వైద్య సంఘానికి క్షమాపణలు చెప్పారు. 'వైద్యరంగాన్ని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. మొదటిసారిగా ఉద్రేకపూరితంగా జరిగింది. ఆ వృత్తికి క్షమాపణలు చెబుతున్నా' అని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி