జన్వాడలోని రాజ్ పాకాల ఫామ్ హౌస్ పార్టీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పార్టీలో నిర్వాహకులు కేసినో రన్ చేసినట్లు గుర్తించారు. నాలుగు సూట్ కేసుల్లో కేసినో మెటిరీయల్ స్వాధీనం చేసుకున్నారు. కాగా పార్టీలో 42 మంది పాల్గొనగా.. 14 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఓ మహిళా సెలబ్రెటీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసు నమోదు చేసి పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.