భారత అథ్లెటిక్స్ సమాఖ్య నూతన కార్యవర్గం తొలి వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా 9 మంది అథ్లెట్లతో కూడిన ఏఎఫ్ఐ అథ్లెట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మరోసారి సీనియర్ ఉపాధ్యక్షురాలిగా ‘డబుల్ ఒలింపియన్’ అంజూ బాబీ జార్జి కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరించనుంది. పురుషుల విభాగం నుంచి ఏఎఫ్ఐ అధ్యక్షుడు బహదూర్‌సింగ్, నీరజ్ చోప్రా, అవినాష్ సాబ్లే ఉన్నారు.