TG: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టీపీసీసీ జనరల్ సెక్రటరీ రవళిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉంటే కిషన్ రెడ్డికి ఎంత జుట్టు ఉందో అన్ని నిధులు కేంద్రం నుంచి వస్తాయని తెలంగాణ సమాజం అనుకుందన్నారు. కానీ.. ధర్మపురి అరవింద్‌కు బోడి గుండు మీద ఎంత జుట్టు ఉందో అన్ని నిధులు వచ్చాయని విమర్శించారు.