ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బుధవారం స్థానిక బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మను ఓ న్యాయవాది చెంపదెబ్బ కొట్టడం కలకలం రేపింది. అయితే, ఈ తతంగం మొత్తం పోలీసుల కళ్లెదుటే జరగడం విశేషం. చెంపదెబ్బ కొట్టిన న్యాయవాది స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అవధేష్ సింగ్‌గా గుర్తించారు. ఈ ప్రాంతంలో త్వరలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.