మున్సిపల్ చెత్త వాహనంలో నవజాత శిశువు లభ్యమైన ఘటన గురువారం నిర్మల్ పట్టణంలో కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం నిర్మల్ మున్సిపాలిటీకి చెందిన ఓ వాహనం చెత్త పడేయడానికి డంపింగ్ యార్డ్ కు వెళుతుండగా మార్గమధ్యంలో కవర్ కింద పడిపోగా అందులో నుండి నవజాత శిశువు మృతదేహం లభ్యం అయిందని తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.