మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన భైంసా మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం మండలలో ఇలేగాంకు చెందిన దేవిదాస్ (38) కొన్ని రోజులుగా మద్యానికి బానిసై డబ్బులు ఇవ్వాలని భార్యతో గొడవ పడేవాడు. సోమవారం సాయంత్రం మద్యానికి డబ్బులు ఇవ్వమని గొడవపడి మద్యం మత్తులో పురుగుల మందు తాగగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు తెలిపారు.