మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడినట్లు మంచిర్యాల పట్టణ సీఐ బన్సీలాల్ బుధవారం తెలిపారు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి, చేతిలో కత్తులు పట్టుకొని ఎమ్మెల్యే ఇంటి ప్రహరీ దూకి లోపలికి వచ్చారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. వాచ్మన్ గమనించి ఆరుపులు, కేకలు వేయడంతో పారిపోయారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.