స్పాట్ వాల్యుయేషన్ పాత పేపర్లు విక్రయం

60பார்த்தது
స్పాట్ వాల్యుయేషన్ పాత పేపర్లు విక్రయం
జూన్- 2022, ఏప్రిల్-2023లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ కు సంబందించిన పాత పేపర్లు విక్రయానికి స్థానికంగా ఉన్న పాత పేపర్లు కొనే వారి నుండి కొటేషన్ ఆహ్వానిస్తున్నట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. పేపర్లు కొనదలచిన వారు డీఈఓ పేరు మీద రూ. 10 వేలు డీడీ, కొటేషన్ లో కిలో పేపర్ ధర కోడ్ చేసి సీల్డ్ కవర్ ద్వారా ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాలని సూచించారు.

தொடர்புடைய செய்தி