రామగుండం పోలీస్ కమిషనరేట్ లో శుక్రవారం స్వాతంత్ర సమరయోధుడు, తొలి, మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, స్వరాష్ట్ర సాధనలో అలుపెరగని కృషి చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్షణీయం అన్నారు.