తీవ్ర జ్వరంతో మహిళ మృతి చెందిన ఘటన ఖానాపూర్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం అంబేద్కర్ నగర్ కు చెందిన శంకరమ్మ(40)కు జ్వరం రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. రక్తపరీక్షలు చేయించగా రక్తకణాలు తక్కువ అయినట్లు రిపోర్టులు రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు నిర్మల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.