తలమడుగు: స్వాగత తోరణం ఏర్పాటుకు భూమి పూజ
తలమడుగు మండలం బరంపూర్ కొండపై వెలసిన పురాతన శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత వెంకన్న ఆలయానికి వెళ్లే మార్గంలో స్వాగత తోరణం ఏర్పాటుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాగత తోరణం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కేదారేశ్వర్ రెడ్డి, కోశాధికారి మల్లేష్, వీడీసీ అధ్యక్షుడు శ్రీనివాస్, మోహన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.