బోథ్: యువకుడి చొరవతో అధికార యంత్రాంగం కదిలింది
బోథ్: మండల కేంద్రంలోని పెద్దవాగుపై గల బ్రిడ్జిపై 3 నెలల క్రితం గుంత పడి ప్రమాదకరంగా మారింది. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గమనించిన గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ ఆర్ అండ్ బి అధికారులకు వివరణ కోరగా ఈఈ నర్సయ్య మరమ్మత్తులు నిర్వహిస్తామని కలెక్టర్ కు వివరణ పంపారు. ఈ మేరకు యువకుడికి ఫోన్లో ఈ విషయాన్ని తెలియజేశారు.