రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు సకాలంలో సరుకులను పారదర్శకంగా అందించాలని తాంసి తహశీల్దార్ లక్ష్మీ అన్నారు. తాంసిలోని చౌకధరల దుకాణాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ తెలిపే బోర్డులు, రిజిస్ట్రేషన్ ప్రకారం ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయా లేదా ఆరా తీశారు. అదేవిధంగా షాపుల్లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారనే వివరాలను డీలర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట మండల అధికారులు ఉన్నారు