తలమడుగు మండలంలోని పల్సి (బి) గ్రామంలో మహారాష్ట్ర బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచ ప్రజలు పాల్గొనగా వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. గిరిజన గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని, మహారాష్ట్ర బ్యాంకు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కాంతారావు అన్నారు.