బోథ్ మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా విచ్చలవిడిగా పలు కాలనీలలో బెల్ట్ షాపులను అక్రమంగా నిర్వహిస్తూ మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగిస్తున్నారని సామాజిక కార్యకర్త జక్కుల వెంకటేష్ శుక్రవారం అన్నారు. బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాహశీల్దార్ సుభాష్, ఎస్సై ప్రవీణ్ కుమార్ లను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. యువత చెడు అలవాటులకు బానిస కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు.