దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తలమడుగు మండలంలోని ఉండం గ్రామంలో తొమ్మిది రోజులు పూజలందుకున్న దుర్గాదేవి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహిస్తున్నారు. వాహనాన్ని పూలమాలలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు. డీజే ముందు యువకులు, పిల్లలు అమ్మవారి పాటలతో నృత్యాలు చేశారు. కాగా గ్రామంలోని పురవీధుల గుండా దుర్గాదేవి ఊరేగింపు కొనసాగుతోంది