ఇచ్చోడ మండలంలోని ఆడేగాం (బి) గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రిజిష్టర్ లు రికార్డులను ఆయన పరిశీలించారు. వంట గదిని, కిచెన్ గార్డెన్ ను పరిశీలించారు. అంగన్వాడి కేంద్రానికి వచ్చే చిన్నారులకు తెలుగు, ఇంగ్లీష్ లో వ్రాయడం, మాట్లాడడం నేర్పించాలని, నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని మెనూ ప్రకారం అందించాలని సూచించారు.