పంట క్షేత్రాల్లో నీటి సౌకర్యం ఉన్నా, లేకపోయినా పత్తి కట్టెను తొందరగా తీసివేసి రెండో పంటలు వేసుకోవాలని, పత్తి పంటను పొడిగించడంతో గులాబీ రంగు పురుగు ఉద్ధృతి పెరుగుతుందని కెవికె శాస్త్రవేత్తలు తెలిపారు. తలమడుగు మండలం లచ్చాపూర్‌లోని పంట క్షేత్రాల్లో పత్తి కట్టెను భూమిలోనే కలియదున్నే చిప్ శ్రేడ్డర్ యంత్రం పనితీరుపై క్షేత్ర ప్రదర్శన జరిపారు. ఈ మేరకు యంత్రం పని తీరుతో పాటు పలు అంశాలపై రైతులకు వివరించారు.