గుడిహత్నూర్ మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ముఖ్యఅతిథిగా హాజరై మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత ప్రభుత్వ పథకాన్ని మాత్రమే అందజేయకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.