రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలి: బోథ్ ఎమ్మెల్యే

65பார்த்தது
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంటనే పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ చేపట్టాలన్నారు. బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ నియోజకవర్గ కన్వీనర్ మొట్టే కిరణ్, మండల కన్వీనర్ తోట వెంకటేష్, కేదారేశ్వర్ రెడ్డి అభిరామ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி