ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పోరు బాట సభలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం తలమడుగు మండలం సుంకిడిలో ఆయన దిష్టి బొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు. బోథ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజరెడ్డి ఉన్నారు.