ఇచ్చోడలో ఈ నెల 16న రమాబాయి అంబేడ్కర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాప్రజ్ఞ బుద్ధవిహార్ ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షురాలు దయశీల తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఆమె మాట్లాడారు. కార్యక్రమానికి అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్, దంతేజీలు హాజరవుతారని చెప్పారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు వినిపిస్తారని తెలిపారు. దీనికి బౌద్ధ ఉపాసకులు హాజరై జయప్రదం చేయాలని కోరారు.