ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సోనాల గ్రామం అన్ని రంగాల్లో ఆదర్శంగా ఉన్నప్పటికీ గ్రామ రహదారుల విషయంలో వెనుకంజలో ఉంది. గ్రామంలోని ప్రధాన రహదరులు గుంతల మయంగా మారడంతో గ్రామస్తులు నిత్యం అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి చిరుజల్లులకే రహదారులు పూర్తిగా బురదమయంగా తయారవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రహదారులను బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.