బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన కాసరవేణి రవి అలియాస్ అశోక్ ఛత్తీస్ గఢ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. కన్నాల బస్తీలో నివాసం ఉంటున్న రాజయ్య, లక్ష్మిల నలుగురు సంతానంలో రవి చిన్నవాడు. పీపుల్స్ వార్ పార్టీ అనుబంధ సంఘం సింగరేణి కార్మిక సమాఖ్యలు చురుకుగా పని చేశాడు. రవి తుది శ్వాస వరకు విప్లవ మార్గాన్ని వీడలేదు.