కాసిపేట మండలం మద్దిమడ గ్రామానికి చెందిన యువకుడు సండ్ర అనిల్ అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశామని దేవపూర్ ఎస్సై ఆంజనేయులు ఆదివారం తెలిపారు. అనిల్ శుక్రవారం తన అన్న అశోక్ వద్దకు వెళ్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచి కనిపించకపోవడంతో తండ్రి లక్ష్మన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.