రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదివారం ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువత ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. అర్హులైన గిరిజన నిరుద్యోగులు tgobmms. cgg. gov. in ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. దరఖాస్తులను ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు. వివరాలకు ఐటీడీఏ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.