కారును ఢీకొట్టిన ట్రక్కు.. ప్రాణాలతో బయటపడ్డ నటి మధుమిత

62பார்த்தது
కారును ఢీకొట్టిన ట్రక్కు.. ప్రాణాలతో బయటపడ్డ నటి మధుమిత
ప్రముఖ బెంగాలీ నటి మధుమితా సర్కార్ తృటిలో ప్రాణాలతో బయటపడింది. భూత్‌నాథ్ ఆలయంలో పూజలు చేసేందుకు సోమవారం ఆమె తన కారులో బయల్దేరింది. ఆ సమయంలో ఓ కార్గో ట్రక్కు ఆమె కారును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో ఆమె తప్పించుకుంది. ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్ తప్పించుకునేందుకు యత్నించగా, స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

தொடர்புடைய செய்தி