గ్రీన్‌కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. గ్రీన్‌కో ఎనర్జీ అనుబంధ సంస్థయిన ఏస్ నెక్ట్స్ జెన్, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం కార్యాలయంలోనూ తెలంగాణ అధికారులు తనిఖీలు చేశారు. ఫార్ములా – ఈ ఒప్పందానికి ముందు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్‌ఎస్‌కు రూ.41 కోట్లు ఇవ్వడంపై ఏసీబీ దృష్టి సారించింది. మరోవైపు ఫార్ములా – ఈ కేసులో విచారణకు రావాలని కేటీఆర్‌కు ఏసీబీ రెండోసారి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.