ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ గురువారం నుండి ప్రారంభమైంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్కు చెందిన 25 ఏళ్ల బౌలర్ అబ్తాహా మక్సూద్.. తల, మెడ చుట్టూ హిజాబ్ ధరించి బౌలింగ్ చేసింది. దుబాయ్‌లో 37 డిగ్రీల వేడిలో కూడా, అబ్తాహా హిజాబ్‌లో బౌలింగ్ చేయడం గమనార్హం. హిజాబ్ తన గుర్తింపు అని, అందుకు గర్వపడుతున్నానని అబ్తాహా తెలిపింది.