అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకమే ‘ఈ శ్రమ్’. రూ.110తో ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ప్రమాద బీమా పథకం కింద రూ.6.30 లక్షలు, సాధారణ మరణమైతే రూ.లక్ష 30 వేలు కార్మిక శాఖ అందిస్తుంది. కార్మికుని కూతురి వివాహం అయితే రూ.30 వేలు, కార్మికుడి భార్య ప్రసవానికి రూ.30 వేలు అందిస్తారు.